తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలోని ఒక డిప్రెషన్ ప్రభావంతో మరో మూడురోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఏలూరు జిల్లాకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. దీంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి.. విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు గోదావరికి భారీగా చేరుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు విపత్తు నిర్వాహణ అధికారులు.
ఆదివారం తెలంగాణ వెదర్ రిపోర్ట్..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. కొమురం భీం జిల్లాకు భారీ వర్షాల అలర్ట్ ఇవ్వడంతోపాటు.. మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..