ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్


కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,588 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 3,406 కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు పురుష అభ్యర్ధులకు, 182 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు మహిళా అభ్యర్ధులకు కేటాయించారు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 24, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. పురుషులకు ఎత్తు కనీసం 165 సెంటీమీటర్లు, ఛాతీ 75 నుంచి 80 సెంటీమీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకు ఎత్తు 155 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 23, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.150 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్‌) పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *