ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తు నుంచి కృష్ణమ్మ దూకితే ఎట్టా ఉంటాదో తెలుసా.. రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదపోటు ఏ రేంజ్లో ఉంటాదో తెలుసా.. ఇదిగో ఇట్టా ఉంటాది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు బిరబిరా పరుగెడుతోంది.
శ్రీశైల మల్లన్న చెంత ఉధృతంగా ప్రవహిస్తూ.. నాగార్జునసాగర్వైపు పోటెత్తింది. ఈ సీజన్లోనే తొలిసారిగా నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.