ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న చిరుజల్లులు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షపు చినుకుల్లో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల తెగ ఎంజాయ్ చేస్తుంది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటుంది.
రోడ్డుపై చినుకుల్లో తడుస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే బ్లూకలర్ గొడుగు పట్టుకొని, తన క్యూట్ నెస్‌తో వావ్ అనిపించేలా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇక వీటికి వర్షం పడుతుంది.. శ్రీలీలను బయటకు వాకింగ్ తీసుకెళ్లాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి, వర్షపు చినుకుల్లో చాలా క్యూట్‌గా ఉన్నావంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పెళ్లి సందD సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ మూవీలో తన నటన, గ్లామర్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని, తర్వాత తెలుగులో వరసగా ఛాన్స్ లు అందుకుంది. అనతి కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. బాలీవుడ్ , కోలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా పుష్ప2 సినిమాలో కిసక్కీ సినిమాతో మరోసారి తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది.అంతే కాకుండా నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మరోసారి థియేటర్లో సందడి చేచేసింది. కానీ ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమాలు ఫ్లాప్ అయినా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర, హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమా చేస్తున్నట్లు సమాచారం.