ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


దివంగత రైటర్, ప్రముఖ సినీ నటుడు ఓంకార్ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నిరుపమ్ పరిటాల. సీరియల్స్ తో పాటు ఫిటింగ్ మాస్టర్, రభస వంటి కొన్ని సినిమాల్లోనూ నటించాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై అంతగా లక్ కలిసి రాకపోవడంతో బుల్లితెరపైనే ఫుల్ ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కార్తీక దీపం, హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, అత్తారింటికి దారేది, కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవెర ప్రాణం సీరియల్స్‌లో నటించా బుల్లితెర ఆడియెన్స్ కు చేరవయ్యాడు నిరుపమ్. ముఖ్యంగా టీఆర్పీ విషయంలో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది కార్తీక దీపంతో బాగా ఫేమస్ అయిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్రకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం 2 కూడా ప్రసారమవుతోంది.

ఇవి కూడా చదవండి

రెమ్యునరేషన్ లో టాప్ గా నిరుపమ్..

కాగా తెలుగు బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో నిరుపమ్ కూడా ఒకరు. ఒక్క రోజుకే సుమారు 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని టాక్. అలా ప్రస్తుతం కార్తీక దీపం 2, హిట్లర్ గారి పెళ్లాం, కుమారి శ్రీమతి తదితర సీరియల్స్‌లో నటిస్తున్నాడు నిరుపమ్. అలాగే పలు టీవీ షోలు, ఈవెంట్స్, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది స్టార్స్ లాగానే నిరుపమ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. తన భార్య మంజులతో కలిసి క్లాత్ బిజినెస్ ప్రారంభించారు. ఈ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నిరుపమ్ దంపతులు.

భార్య మంజులతో నిరుపమ్..

ఈ క్రమంలోనే శ్రీవల్లి కలెక్షన్స్‌‌తో చేతులు కలిపి చందానగర్‌లో కొత్త క్లాత్ స్టోర్ ప్రారంభించనున్నట్లు నిరుపమ్ తెలిపాడు. జూలై 30వ తేదీన ఈ స్టోర్ లాంచ్ చేస్తున్నామని.. ఇందుకు అందరి ఆశీస్సులు కావాలని నిరూపమ్- మంజుల కోరారు. ప్రస్తుతం వీరు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నిరూపమ్ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *