
పై ఫొటోలో ఎన్ సీసీడ్రెస్ లో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? చాలా మంది లాగే అతను కూడా చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలనుకున్నాడు. సైనికుడిగా దేశ సరిహద్దుల్లో సేవలందించాలనుకున్నాడు. అందుకే స్కూల్ లో ఎన్ సీసీ ప్రోగ్రాంలో చేరాడు. అలాగే కళాశాలలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఉత్తమ NCC క్యాడెట్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడి బ్రిటిష్ ఆర్మీ, రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్‌లలో శిక్షణ కూడా పొందాడు.
జపాన్‌లోని టోక్యోలో జరిగిన యంగ్ బిజినెస్మెన్ కాన్ఫరెన్స్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం కూడా వహించాడు. అయితే ఉన్నట్లుండి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. మొదట మోడలింగ్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. చూడ్డానికి అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపించే ఈ నటుడికి అమ్మాయిల ఫ్యాన్ ఫాయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఈ హీరో వయసు 50 దాటిపోయింది. కానీ ఇప్పటికీ స్లిమ్ గా, హ్యాండ్సమ్ లుక్ తో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికీ అమ్మాయిల ఫేవరెట్ హీరో అయిన ఆ నటుడు మరెవరో కాదు మాధవన్.
చెలి, సఖి సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాధవన్. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశాడు. నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో విలన్ గానూ మెప్పించాడు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది సైతాన్ సినిమాతో భయ పెట్టిన మాధవన్ ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు మూవీస్ లో నటించాడు.
ఆప్ జైసా కోయి సినిమాలో మాధవన్..
View this post on Instagram
ఈ ఏడాది మాధవన్ నటించిన హిసాబ్ బరాబర్, టెస్ట్, కేసరి ఛాప్టర్ 2, ‘ఆప్ జైసా కోయి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నీ ఆడియెన్స్ ను మెప్పించాయి. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న దురంధర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్టులోనూ ఈ హ్యాండ్సమ్ హీరో యాక్ట్ చేస్తున్నాడు.
అమృత్ సర్ స్వర్ణ దేవాయంలో పూజలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..