బాలీవుడ్ యాక్టర్, నిర్మాత, దర్శకుడు మాన్ సింగ్ తెరకెక్కించని తాజా మువీ ‘సో లాంగ్ వ్యాలీ’. ఈ మువీ ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం (జూలై 25) ముంబైలోని సినీపోలిస్ థియేటర్ వద్ద చిత్ర యూనిట్‌తో పాటు మాన్‌సింగ్ కూడా వచ్చాడు. సరిగ్గా అదే టైంలో అక్కడకు వచ్చిన హీరోయిన్ రుచి కోపంతో ఊగిపోయారు. ప్రొడ్యూసర్‌పై గట్టిగట్టిగా అరుస్తున్నట్లు ఉన్న వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇంతలో ఆమె కోపం తారా స్థాయికి చేరడంతో తన చెప్పు తీసి హీరో మాన్‌సింగ్‌పైకి విసిరేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న అందరూ షాకై చూస్తుండగా.. మరో చెప్పు తీసి అంతడిపైకి విసిరింది. దీంతో మాన్‌సింగ్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకు ప్రొటెక్షన్ ఇస్తూ చుట్టూ గుమిగూడారు. మాన్ సింగ్ పై దాడి చేసే సమయంలో నిర్మాత కరణ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతటితో ఆగకుండా తనకు మాన్ సింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటి వరకూ ఇవ్వలేదనీ బహిరంగంగా ఆరోపించారు. మాన్ సింగ్ తనకు రూ.25 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఎన్నో రోజులుగా అడుగుతున్నా ముఖం చాటేస్తున్నట్లు ఆరోపించింది. అందుకే ఇలా బహిరంగంగా అడగవల్సి వచ్చిందని చెప్పారు. రుచి అక్కడికి నిరసన తెల్పేందుకే వచ్చినట్లు తెలుస్తుంది. చిత్ర నిర్మాత గాడిదలపై కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించిన కొన్ని ప్లకార్డులను కూడా హీరోయిన్ రుచి సంఘటనా స్థలంలో ప్రదర్శించి హల్‌చల్ చేసింది. ఇంతలో అక్కడే ఉన్న మూవీ టీం సభ్యులు రుచిని అడ్డగించి అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివాదం ఏంటీ?
మాన్ సింగ్ గతేడాది తనను సంప్రదించి సోనీ టీవీలో త్వరలో ప్రసారం కానున్న హిందీ టీవీ సిరీస్‌లో పనిచేస్తున్నానని చెప్పాడని, దీనికి తనను సహ నిర్మాతగా చేర్చుకుంటానని, ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను కూడా పంపాడని ఆమె చెప్పింది. రుచి కూడా ఆ ఆఫర్‌ను ఆంగీకరించి జూలై 2023 నుంచి జనవరి 2024 మధ్య చౌహాన్ కె స్టూడియోస్‌కు అనుసంధానించబడిన ఖాతాలకు తన కంపెనీ SR ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి బహుళ చెల్లింపులు చేసినట్లు చెప్పింది. కానీ అతడు చెప్పిన ప్రాజెక్ట్ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని, పైగా తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా.. వాయిదా వేస్తూ వచ్చాడని తెల్పింది. తన డబ్బుతో హిందీ సీరియల్‌కు బదులు సో లాంగ్ వ్యాలీ సినిమా తీయడానికి ఉపయోగించినట్లు తెలిసి అతడిపై కేసు కూడా పెట్టింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), 352, 351(2) కింద నటి రుచిని రూ.25 లక్షలు మోసం చేసినందుకు మాన్‌సింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
హీరోయిన్ రుచి గుజ్జర్ నటిగా మాత్రమే కాదు మోడల్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటోంది. 2023లో మిస్ హర్యానా టైటిల్ కూడా గెలుచుకుంది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీ ఫోటో లాకెట్ ఉన్న నెక్లెస్ ధరించి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.
ముత్యాలు, ఎర్రటి ఎనామెల్ కమలాలతో ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ ఫొటో ఉన్న లాకెట్టున్న నెక్లెస్ ధరించి పొలిటికల్ ప్యాషన్‌ను కేన్స్ 2025 వేదికపై ప్రదర్శించింది. ఇప్పుడు ఏకంగా మువీ నిర్మాతపై చెప్పుతో దాడి చేసి బాలీవుడ్‌లో చర్చకు కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.