
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. శ్రీలంక రాజధాని కొలంబోలో పుట్టి పెరిగిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది. నటించింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. కేవలం సినిమాలే కాదు సీరియల్స్ బాగా చూసే వారికి కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. తెలుగులో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇప్పటికీ కొన్ని తమిళ్ సీరియల్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తోంది. తాజాగా ఈ సీనియర్ నటి శనివారం (జులై26) తిరుమలలో సందడి చేసింది. ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. దీంతో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. వీటిని చూసిన చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు? మరి మీరు గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సింధూర పువ్వు హీరోయిన్ నిరోషా.
తెలుగులో సింధూర పువ్వు, నారీ నారీ నడుమ మురారి, కొబ్బరి బొండాం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, ముద్దుల మావయ్య, అత్తింట్లో అద్దె మొగుడు, ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు, డిటెక్టివ్ నారద, వన్ బై టూ, పచ్చని సంసారం, భలే ఖైదీలు తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది నిరోషా. అలాగే కొన్ని తమిళ్, మలయాళం సినిమాల్లోనూ నటించింది. అలాగే సీరియల్స్ విషయానికి వస్తే.. సుడి గుండాలు, ఇది కథ కాదు, మావిడాకులు, జనని, మనసా కవ్వించకే, కథ కాని కథ, దేవతలరా దీవించండి తదితర ధారావాహికలతో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది.
నటి నిరోషా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
అన్నట్లు నిరోషా భర్త కూడా ప్రముఖ నటుడే. ఓసేయ్ రాములమ్మ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాంకీని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను ఇప్పటికీ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇక నిరోషా ప్రస్తుతం కొన్ని తమిళ్ సీరియల్స్ లో మాత్రమే నటిస్తోంది.
కమల్ హాసన్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.