ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


మోడల్ గా, హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా, దర్శకురాలిగా, ఎడిటర్ గా.. ఇలా వివిధ రంగాల్లో రాణించి మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు రేణూ దేశాయ్. బద్రి, జానీ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక విడాకుల అనంతరం సింగిల్ మదర్ గా తన ఇద్దరు పిల్లలను పెంచి పోషించారు. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు రేణు దేశాయ్. . దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో కొనసాగుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజై సుమారు రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా మరే సినిమాను ప్రకటించలేదు రేణూ దేశయ్. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ. ముఖ్యంగా మహిళలు, మూగజీవాల సంక్షేమం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందుకోసం ఒక ఎన్జీవోనూ కూడా స్థాపించారామె.

అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ సామాజిక అంశాలపై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. అలా తాజాగా జరిగిన ఒక ఘటనపై ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఇస్కాన్ కు సంబంధించిన రెస్టారెంట్ కి ఒక బ్రిటీష్ వ్లాగర్ వెళ్లాడు. అక్కడ వెజ్ మాత్రమే దొరుకుతుందని తెలిసినా కూడా అతడు కేఎఫ్ సీ చికెన్ ఉందా అని అడిగాడు. అలాంటివి ఇక్కడ దొరకవు అని అక్కడ పనిచే సే సిబ్బంది చాలా మర్యాదగా చెప్పారు. అయితే ఆ వ్లాగర్ హఠాత్తుగా తన బ్యాగ్ లో నుంచి కేఎఫ్సీ చికెన్ పీసులను తీసి అక్కడే తినడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇక్కడ నాన్ వెజ్ నిషిద్ధమని, దయచేసి ఇక్కడ ఇలాంటివి తినకూడదు అని ఎంతని వారించినా అతను మాత్రం వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సదరు వ్లాగర్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే వీడియోపై రేణూ దేశాయ్ స్పందించారు. ఇతర మతాలు, నమ్మకాలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయిందని సదరు వ్లాగర్ కు ఇచ్చి పడేసింది. ఇలాంటి మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు ఆ వ్లాగర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కామెంట్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *