సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో నాని సినిమా ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ తన పాత్రలోని వేరియాక్షన్స్ ను అద్భుతంగా చూపించారు. 2004లో విడుదలైన నాని సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ నటించింది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
ఇక ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. నాని సినిమాలోని అన్నిపాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పెదవేపలికిన సాంగ్ ఎవరు గ్రీన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు దేవయాని, రఘువరన్, సునీల్, నాజర్ , బ్రహ్మానందం ఇలా చాలా మంది నటించారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటించిన చిన్నోడు గుర్తున్నాడా.? నాని సినిమాలో మహేష్ బాబు చిన్న వయసులోనే పెద్ద వాడిగా ఎదిగిపోవాలని అనుకుంటాడు. రఘువరన్ చేసిన ఓ ప్రయోగం కారణంగా అతను పెద్దవాడిగా చిన్న కుర్రాడిలా మారుతూ ఉంటాడు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించిన చినోడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరో కాదు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మహేష్ మేనల్లుడు హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా దేవకీ నందన వాసుదేవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.