హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలోకి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ అడియన్స్ ఎక్కువగా ఇష్టపడే జానర్స్ లో హారర్ ప్రధానం. అందుకే తెలుగుతోపాటు ఇతర భాషలలో విడుదలైన హారర్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు.ఈ జానర్ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. తాజాగా రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే దక్ష. 2023లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సీనియర్ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించారు.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
దక్ష సినిమాలో ఆయుష్ తేజ్, అఖిల్, అను, నక్షత్ర, రియా, రవిరెడ్డి, శోభన్ బోగరాజు, పవన్ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2023 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. దాదాపు రెండేళ్ల క్రితం థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
ప్రస్తుతం ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో వచ్చిన ఈ హారర్ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్ ఫుల్ విజువల్స్ సినిమాకు ప్రధాన బలాలు. ఈ చిత్రానికి లలిత్ కిరణ్ సంగీతం అందించారు.
Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..
Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..