ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నవారే. పొట్ట కూటి కోసం రకరకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈమె కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. పేదరికంలోనే పుట్టి పెరిగింది. తోబుట్టువ్వులెవరూ లేరు. దీంతో తన తల్లిని పోషించడానికి 11 ఏళ్లకే బార్ డ్యాన్సర్ గా మారాల్సి వచ్చింది. చివరకు డబ్బుల్లేక వేరే గత్యంతరం లేక వ్యభిచారం కూపంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇలా చిన్నప్పటి నుంచే రకరకాల మనుషులను దగ్గరుండి చూసిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు కథలు రాసిన ఆమె ఇమ్రాన్ హష్మీ, ఆదిత్య రాయ్ కపూర్‌ వంటి హీరోలను స్టార్స్ గా మార్చేసింది. ఆమె మరెవరో కాదు.. ‘వో లమ్హే’, ‘మర్డర్ 2’, ‘జన్నత్ 2 ‘, ‘ఆషికి 2’ , ‘జిస్మ్ 2’, ‘రాజ్ 3D’ తదితర చిత్రాలకు కథలు అందించిన షగుఫ్తా రఫీక్. అయితే ఆమె జీవితంలో సినిమాను మించిన ఎన్నో ట్విస్టులున్నాయి

షగుఫ్తాకు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తల్లిపై భారాన్ని తగ్గించడానికి ప్రైవేట్ పార్టీలలో నృత్యం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత జీవితంలో సెటిల్ అవ్వొచ్చన్న నమ్మకంతో 17 ఏళ్లకే ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అండగా నిలిచేవారు లేక పొట్టకూటి కోసం వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. కొన్ని రోజుల ముంబై, దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేసింది. జీవితం మీద విరక్తితో ఆ పనిలోకి వెళ్లానని, ఆ లైఫ్ నుంచి బయటపడటానికే బార్ డ్యాన్సర్‌గా మారానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది షగుఫ్తా.

కాగా కథల రచనలో షగుఫ్తా ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. తన స్వీయానుభవంతోనే ఎన్నో కథలను తెరకెక్కించింది. అయితే ప్రారంభంలో ఆమెను అనేక బడా నిర్మాణ సంస్థలు, టీవీ షోలు తిరస్కరించాయి. ఆమె మాట్లాడుతూ, ‘నేను రచయితగా పని అడగడానికి ప్రొడక్షన్ హౌస్ లు మరియు టీవీ షోలకు వెళ్ళాను, కానీ నాకు అనుభవం లేనందున ఎవరూ ఆసక్తి చూపలేదు’ అని ఒక ఇంటర్వ్యూలో వాపోయారీ స్టార్ రైటర్.

షగుఫ్తా రఫీక్ లేటెస్ట్ ఫొటోస్..

మహేష్ భట్ నిర్మాణ సంస్థ ‘విశేష్ ఫిల్మ్స్’లో పనిచేయడం ప్రారంభించాక షగుఫ్తా జీవితం మారిపోయింది. ఇప్పటి వరకు పలు సూపర్ హిట్ చిత్రాలకు స్క్రిప్ట్‌లు రాసింది. కాలక్రమేణా ఆమెక బాలీవుడ్ లో స్టార్ రైటర గా మంచి గుర్తింపు కూడా వచ్చింది. షగుఫ్తా కథలు చాలా రియలిస్టిక్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయి.అందుకే అవి అందరికీ కనెక్ట్ అయ్యేవి. . ఆమె కథలు రియల్ లైఫ్ అనుభవాల నుంచి పుట్టాయి కాబట్టే ఆడియన్స్‌కు అంతగా నచ్చాయని మహేష్ భట్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *