
ఫహద్ ఫాసిల్.. ఈ పేరు వినని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరు. ఈ మలయాళ నటుడు ఇప్పుడు భారతదేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఈ నటుడి స్టైల్. అందుకే ఇప్పుడు మలయాళంలోనే కాకుండా అనేక ఇతర భాషలలో కూడా చాలా బిజీగా ఉంటున్నాడు ఫహద్ ఫాసిల్. ఇక తన డిమాండ్ అండ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నాడు. సాధారణంగా నటులు సినిమాలు మానేస్తే ఎక్కువగా బిజినెస్ రంగంలోకి అడుగు పెడతారు .మరికొందరు రాజకీయ పార్టీల్లో చేరతారు. ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయ నాయకులుగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరికొందరు సినిమా నిర్మాణ సంస్థలు తెరిచి, సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తారు. కానీ ఫహద్ ఫాసిల్ సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత టాక్సీ డ్రైవర్ కావాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత బార్సిలోనాలో టాక్సీ డ్రైవర్ కావాలనేది ఫహాద్ ఫాసిల్ కల. ఇటీవల ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మీకు ఇప్పటికీ అదే కల ఉందా అని అడిగినప్పుడు, ఫహద్ “ఖచ్చితంగా” అని అన్నారు. “నేను కొన్ని రోజుల క్రితం స్పెయిన్‌లో ఉన్నాను. ఇప్పటికీ అదే ఆలోచన నా మనసులోనే ఉంది. నా సినిమాలు ఆడియెన్స్ కు నచ్చకపోతే వెంటనే రిటైరైపోతాను. హాయిగా ట్యాక్సీ తోలుకుంటనాఉ. నేనేమీ జోక్ చేయడం లేదు. టాక్సీ నడపడం మంచి పని. ఇతరులను వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడం డ్రైవర్ గా నాకు ఒక గొప్ప పని అనుకుంటున్నాను’ అని ఫహాద్ చెప్పుకొచ్చారు .
భార్య నజ్రియాతో ఫహాద్ ఫాజిల్..
View this post on Instagram
ఫహద్ ఫాసిల్ తమిళ చిత్రం ‘మారిసన్’ శుక్రవారం (జూలై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ దొంగ పాత్రలో నటించాడు. వడివేలు కూడా ఈ చిత్రంలో మరో కీ రోల్ లో మెరిశాడు. దీంతో పాటు ఫహాద్ ‘ఓడుమ్ కహిరి ఇడుమ్ కహిరి’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘కరాటే చంద్రన్’, ‘పేట్రియాట్’ అనే సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..