సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత సులభం కాదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను భరించి ఇండస్ట్రీలో ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట్లోనూ ఎన్నో అవమానాలు ఎదుర్కోంది. కానీ నిశ్శబ్దంగానే ప్రతి అవకాశాన్ని అందుకుని తన ప్రతిభతో మెప్పించాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. కట్ చేస్తే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ కృతి సనన్.
ఇవి కూడా చదవండి: Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
ఇవి కూడా చదవండి
1990 జూలై 27న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది కృతి సనన్. ఆమె తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. 2014లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 1: నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం టైగర్ ష్రాఫ్ జోడిగా హీరోపంతి సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
హిందీలో దిల్వాలే, బరేలీ కి బర్ఫీ, లూకా చుప్పీ, రాబ్తా వంటి హిట్ చిత్రాలతో మెప్పించింది. 2021లో మిమి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం కృతి వయసు 35 సంవత్సరాలు. నటిగానే కాకుండా నిర్మాతగా మెప్పించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మెప్పించారు.
Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..
Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..