ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


రాబిన్ హుడ్ తర్వాత యూత్ స్టార్ నటించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్,లయ రీ ఎంట్రీ, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ ఉండడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వీటికి తోడు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను డిజప్పాయింట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తమ్ముడు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కు నిరాశే మిగిలింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయన తమ్ముడు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

తాజాగా తమ్ముడు సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టు 01 నుంచి నితిన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ‘తన లక్ష్యాన్ని, అక్కను తిరిగి తెచ్చుకోవడానికి ఈ తమ్ముడు బయలు దేరాడు. ఆగస్టు 01 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడండి’ అని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

తమ్ముడు సినిమాలో స్వసిక విజయన్, హరితేజ, సౌరబ్ సచ్ దేవ, శ్రీకాంత్ అయ్యంగర్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *