ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న కింగ్ డమ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్ .ఇందులో భాగంగా శనివారం (జులై 26) తిరుపతి వేదికగా కింగ్ డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు ‘కింగ్‌డమ్’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ గారికి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్ పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.

కాగా ప్రమోషన్లలో భాగంగా కింగ్ డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం (జూలై 28న) సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సత్యదేవ్ నటించాడు. అనిరుధ్ అందించిన స్వరాలు ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

కింగ్ డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ స్పీచ్.. ఫుల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *