ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కింగ్ డమ్ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (జులై 26) రాత్రి కింగ్ డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది కింగ్ డమ్ ట్రైలర్. దీని తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకుంది. ప్రీమియర్స్ టికెట్లు భారీగా సేల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్, స్టార్ హీరోయిన్ రష్మిక కింగ్ డమ్ పై ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కింగ్‌డమ్‌ ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్‌కు రష్మిక రిప్లై ఇచ్చింది.

‘ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్‌, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్‌లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చింది రష్మిక. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. ‘రస్సీలు అంటూ లవ్ సింబల్‌తో పాటు ఎంజాయ్ ది కింగ్‌డమ్‌’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం రష్మిక- విజయ్ ల ట్విట్టర్ ఛాట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కింగ్ డమ్ పై రష్మిక ట్వీట్..

విజయ్ దేవరకొండ రిప్లై..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *