ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ప్రముఖ ఫోక్ సింగర్ మధు ప్రియ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె సోదరి శ్రుతి ప్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. సుమంత్ పటేల్ అనే వ్యక్తితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా శ్రుతి ప్రియ- సుమంత్ ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. సింగర్ మధుప్రియ దగ్గరుండి మరీ ఈ ఏర్పాట్లు చేసింది. తన చెల్లికి గ్రాండ్ గా నిశ్చితార్థం చేసింది. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఫైనల్లీ.. చెల్లి, మరిది.. మిమ్మల్ని ఇలా చూడడం ఆనందంగా ఉంది’ అంటూ మురిసిపోయింది మధుప్రియ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ ఆడపిల్లనమ్మా పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో ఈ పాట పడి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో ‘పెద్దపులి’ అనే హుషారెత్తించే సాంగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర సినిమాల్లో మధు ప్రియ పాడిన పాటలు సంగీతాభిమానులను ఉర్రూతలూగించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించింది కూడా మధు ప్రియనే. మేల్ వెర్షన్ లో రమణ గోగుల ఈ సాంగ్ ను ఆలపించగా, లేడీ వెర్షన్ లో మధు ప్రియ పాడింది. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

చెల్లి నిశ్చితార్థం వేడుకలో సింగర్ మధుప్రియ.. ఫొటోస్..

కాగా 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మధుప్రియ. అయితే కొన్ని కారణాలతో అతని నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

బోనాల ఉత్సవాల్లో మధు ప్రియ..

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *