కానీ ఇప్పుడు, రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ చూశాక మాత్రం… అదీ తెలుగోడి దెబ్బ.. అంటున్నారు. పెర్ఫార్మెన్స్లో మనోడిని కొట్టేవాడు లేడంటూ… కాస్త గట్టిగా చెబుతున్నారు. ఎస్ ! హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా… అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వార్ 2. అటు నార్త్‌లోనూ ఇటు సౌత్ లోనూ ఎన్నో అంచనాలున్న ఈసినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలరే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు వార్ 2 ట్రైలర్ తెలుగు ఫిల్మ్ లవర్స్ అండ్ తారక్ ఫ్యాన్స్‌కు విపరీతమైన కిక్కిస్తోంది. వార్2 ట్రైలర్లో తారక్ తన పర్ఫార్మెన్స్తో చెలరేగి పోవడం.. కొన్ని షాట్స్‌లో ఏకంగా బాలీవుడ్ గ్రీకు వీరుడిగా నామ్ కమాయించిన హృతిక్‌నే డామినేట్ చేయడంతో తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది తెలుగోడి పెర్ఫార్మెన్స్ అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. తన యాక్టింగ్.. ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీతో హిందీ ట్రైలర్లో కూడా హృతిక్‌ను కొట్టేశాడ మా అన్న అంటూ మాస్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. వార్ 2లో తారక్ స్పై గా యాక్ట్ చేస్తున్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎవ్వరూ చేయలేని పనులను.. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని పోరాడేందుకు.. తెగించిన క్యారెక్టర్లా కనిపిస్తోంది. మంచి .. చెడు, తప్పు-ఒప్పు, పాపం – పుణ్యమనే ప్రతీ గీతని ఆలోచించకుండా దాటే వ్యక్తిగా.. తారక్ రోల్ ను డైరెక్ట్ డిజైన్ చేసినట్టు అర్థమవుతోంది. అంతేకాదు ట్రైలర్లో తారక్.. ఇప్పుడు నేను మనిషి కాదు ఆయుధాన్ని..యుద్ధంలో ఆయుధాన్ని! చస్తా లేదా చంపుతా.. అంటూ చెప్పే డైలాగ్ తారక్ క్యారెక్టర్లో ఏదో డార్క్ షేడ్ ఉన్నట్టు హింట్ ఇస్తోంది. ఓవర్ ఆల్గా వార్ 2 .. అయితే విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో.. ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే!
అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!
పోటా పోటీగా రెమ్యునరేషన్స్! మనోడేమో రూ.30 కోట్లు.. ఆయనేమో రూ.48 కోట్లు..!
మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం