ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


అందుకోసం డైరెక్ట్‌గానో.. లేక ఇండైరెక్ట్‌గానో ఏవేవో ప్లాన్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పుడు ‘పరదా’ మూవీ మేకర్స్‌ కూడా ఇదే చేశారు. పవన్‌ క్రేజ్‌ను వాడేందుకు హరి హర వీరమల్లు థియేటర్స్‌లో కాస్త డిఫరెంట్‌గా ప్రత్యక్షమయ్యారు. ఎస్! ప్రవీణ్ కండ్రేకుల డైరెక్షన్లో అనుపమ లీడ్‌ రోల్లో తెరకెక్కిన సినిమా ‘పరదా’. ఈ సినిమా ఆగస్ట్ 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ పై క్రేజ్‌ అండ్ బజ్‌ను పెంచేందుకు ఈ మూవీ మేకర్స్‌ పవన్‌ సినిమాను యూజ్‌ చేసుకున్నారు. హరి హర వీరయల్లు స్క్రీనింగ్ అవుతున్న ఐమాక్స్‌ థియేటర్‌కు.. రిలీజ్‌ రోజే… రెడ్‌ కలర్‌ ముసుగులో కొంత మంది వచ్చారు. థియేటర్లో హంగామా చేశారు. అయితే వీరిని చూసిన థియేటర్లలోని ఆడియెన్స్‌ కాస్త షాకయ్యారు. ఏం జరుగుతుందనేది క్లారిటీ లేక.. వీళ్లని విచిత్రంగా చూస్తూ కూర్చుండిపోయారు. వీరిని వీడియో తీసి నెట్టింట వైరల్ చేశారు. పరదా సినిమా ప్రమోషన్ కోసమే ప్రవీణ్ అండ్ టీమ్.. ఇలా వీరిని వీరమల్లు థియేటర్లో దించారని.. ఓ క్లారిటీ న్యూస్ బయటికి వచ్చింది. సమాజంలో పరదా వల్ల కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్‌ చేస్తూ.. ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్ట్ 22న రిలీజ్‌ అవుతోంది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు ప్రమోషన్‌ కల్పించేందుకు ఇలా చేశారని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్‌ ఎమోషనల్ కామెంట్స్

బిగ్‌ బాస్‌.. సల్మాన్‌కు రూ.100 కోట్లు లాస్‌!

ఫిష్ వెంకట్‌ కుటుంబానికి అండగా సోనూసూద్‌

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?

‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్‌’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్‌ అంటే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *