ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ఇక అలాంటి వారికి పర్ఫెక్ట్ సిరీస్‌… ది స్టోన్ మ్యాన్ మర్డర్‌. ది స్టోన్ మ్యాన్ మర్డర్! ఇదో క్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్! నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. కొన్నేళ్ల క్రితం ముంబై, కోల్ కతా వంటి మహా నగరాలను గడగడలాడించిన సైకో కిల్లర్ నేపథ్యం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ముఖ్యంగా రాత్రిపూట ఫుట్‌పాత్‌ల మీద నిద్రిస్తున్న నిరాశ్రయులను బండరాయితో కొట్టి.. అత్యంత కిరాతకంగా హత్య చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. 1985-1989 మధ్య ముంబై, కోల్‌కతాలో సుమారు 13 మంది ఇతడి చేతిలో హత్యకు గురవుతారు. దీంతో ఆ సైకో కిల్లర్ కు.. స్టోన్ మ్యాన్ అని పేరొచ్చింది. కట్ చేస్తే స్నేహ అనే జర్నలిస్ట్ ట్రైన్ లో హరిద్వార్‌కు వెళ్తూ ఒక డైరీని కనిపెడుతుంది. ఇందులో స్టోన్‌మ్యాన్ హత్యల వివరాలు ఉంటాయి. ఆ డైరీని తీసుకుని స్నేహ.. తన ఫ్రెండ్‌తో కలిసి హరిద్వార్‌ వెళుతుంది. అక్కడ వీరిద్దరూ.. స్వామీ జీవానంద అనే బాబాని కలుస్తారు. అతను అనుమానాస్పదంగా కనిపిస్తాడు. ఇంతలోనే ఒక సాధువు స్నేహ, ఆమె ఫ్రెండ్ ను వెంబడిస్తాడు. మరి ఈ హత్యల వెనక ఉన్న సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేశాడు? ఆ బాబాకు కిల్లర్ కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ స్టోన్ మ్యాన్ ను పట్టుకున్నారా? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ క్రైమ్ సిరీస్‌లో రజతభ దత్త స్టోన్‌మ్యాన్‌గా నటించగా, స్వస్తిక ముఖర్జీ జర్నలిస్ట్ స్నేహగా నటించింది. ఇందులో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌ సుమారు 17-18 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ హోయిచోయ్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. సో .మీకు మైండ్ షేకింగ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ సిరీస్‌ పై ఓ లుక్కేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబీ డియోల్‌కు ముందు ఆ హీరోనే ఔరంగజేబ్‌.. కానీ ఏం చేస్తాం ఆ స్టార్ బ్యాడ్ లక్‌

పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్ ను వాడేందుకు.. పెద్ద ప్లానే వేశారుగా

‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్‌ ఎమోషనల్ కామెంట్స్

బిగ్‌ బాస్‌.. సల్మాన్‌కు రూ.100 కోట్లు లాస్‌!

ఫిష్ వెంకట్‌ కుటుంబానికి అండగా సోనూసూద్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *