జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఆ గాయానికి మందు వేద్దామని చేసిన మణిరత్నంతో చేసిన థగ్ లైఫ్ ఆ గాయాన్ని మరింత పెంచేసింది కానీ మందు కాలేకపోయింది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అయింది.. దాంతో భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా ఫ్లాపైంది.
పొన్నియన్ సెల్వన్‌తో ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. థగ్ లైఫ్‌తో అంచనాలేమాత్రం అందుకోలేకపోయారు. మరోవైపు భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ పెట్టుకున్న ఆశలన్నింటినీ థగ్ లైఫ్ ముంచేసింది.
దాంతో విక్రమ్ 2పై ఫోకస్ చేయబోతున్నారీయన. ఆగిపోయిందనుకుంటున్న ఇండియన్ 3 మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తుంది.. అలాగే విశ్వరూపం 3 లైన్లో ఉంది.. దాంతో విక్రమ్ 2 చేస్తానని లోకేష్ కనకరాజ్ చెప్తున్నారు.
వీటన్నింటి కంటే ముందు వీరధీరసూరన్ ఫేమ్ అరుణ్ కుమార్‌తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నారు కమల్. మొత్తానికి ఫ్లాప్స్ వచ్చినా.. జోరు తగ్గించట్లేదు లోకనాయకుడు.