ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరుకు చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కొంతమంది దీనిని సీరియస్ గా తీసుకున్నారు కూడా.. కొంతమంది లైట్ తీసుకున్నారు. ఎంత చేసిన కొంతమంది కేటుగాళ్ల బుద్ధిమారడం లేదు. హీరోయిన్స్ ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కు కూడా జరిగింది. చిన్న వయసులోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఆమె.. కానీ కొంతమంది ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారు. పిన్న వయసులోనే స్టార్ గా మారుతున్న ఆ హీరోయిన్ కేరీర్  మీద దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

చిన్న వయసులోనే ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలను నెట్టింట వైరల్ చేశారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకున్న ఆమె కోరికలను తొక్కేయాలని అనుకున్నారు. కానీ ఆమె వాటిని అధిగమించి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యింది. ఆమె మరెవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి.. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతున్న అనిఖా సురేంద్రన్. ఈ చిన్నది అజిత్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్లకే వీడియోలు, ఫోటోలు లీక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవి ఫేక్ అని తేలిపోయింది. ఇక 18 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడు బుట్టబొమ్మ అనే సినిమా చేసింది. ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

అనిఖా సురేంద్రన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *