కరోనా సమయంలో ఓటీటీ వేదికల్లోని కంటెంట్ అంతా చూసేశారు మూవీ లవర్స్. వరల్డ్ సినిమా మొత్తాన్ని ఓ పట్టు పట్టేశారు. అన్ని జానర్స్ తిరగేశారు. అందుకే కంటెంట్ విషయంలో ఇప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మినిమం ఎంగేజింగ్‌గా లేకపోతే జనాలు అస్సలు థియేటర్స్‌కు రావడం లేదు. ఇక ఓటీటీలు కూడా జనాల మైండ్ సెట్‌కు తగ్గట్లుగా ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించే ప్రయత్నంచేస్తున్నాయి. కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్… ఇలా అన్ని జోనర్స్‌ను ఎంకరేజ్ చేసే తెలుగు ఆడియెన్స్ ఇప్పుడు రియల్ క్రైమ్ జానర్‌కి బాగా అడిక్ట్ అయిపోయారు.
ఇలాంటి కథలు హిట్స్ కొల్లగొడుతుంటే… నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి మరో షాకింగ్ స్టోరీతో వీక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా వచ్చిందే. ‘Indian Predator: Beast of Bangalore’. ఇది సినిమా కాదు. యథార్థ కథ. కళ్లెదురుగా జరిగిన క్రైమ్‌ల వెనుక దాగిన మానవ మృగపు కథ. ఇది ఉమేష్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ. బయటికి పోలీస్ యూనిఫాంలో ఉన్న ఈ వ్యక్తి… రాత్రి వేళ సీరియల్ కిల్లర్ అవుతాడు. న్యాయాన్ని రక్షించాల్సిన వాడే.. క్రూరుడుగా మారి అత్యాచారాలు, హత్యలు చేశాడు. బెంగళూరులో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలోకి చొరబడి ఇతను అత్యాచారాలు, హత్యలు చేశాడు. మొత్తం 18 మంది మహిళలు అతని అఘాయిత్యానికి బలి అయ్యారు.
ఇతని పాపాలు చూస్తుంటే గుండె వణుకుతుంది. కానీ రియాలిటీని చెప్పడంలో ఈ డాక్యుమెంటరీకి మాస్ మేకింగ్ స్టైల్ ఉంది. ఫ్యాక్ట్స్, ఇన్వెస్టిగేషన్, బాధితుల కథలు అన్నీ చాలా ఇంటెన్స్‌గా చూపించారు. మనస్సు కదిలించే సీన్స్‌కి కొదవ లేదు. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, వయొలెన్స్, ఇన్సెన్సిటివ్ డీటెయిల్స్ ఉండటం వల్ల, ఫ్యామిలీతో చూడటాన్ని స్కిప్ చేస్తేనే మంచింది. కానీ ఎవరైతే క్రైమ్ స్టోరీలు వాస్తవికంగా చూడాలనుకుంటున్నారో… ఇది తప్పక చూడాల్సిన కంటెంట్. Beast of Bangalore – ఇది ఫిక్షన్ కాదు.. రియాలిటీ. ఓ పోలీస్ యూనిఫామ్ వెనక దాగిన పిశాచపు మానసిక స్థితిని బయటపెట్టిన బోల్డ్ నెరేటివ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.