చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఐదు పదుల వయసు దాటినా కూడా తమ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో టబు ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది.
తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది ఇంతకూ ఆమె ఎవరనుకుంటున్నారా.? సీనియర్ హీరోయిన్ టబు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇక హిందీలో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు టబు విలన్ గా మారనుందని తెలుస్తుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో టబు విలన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
పూరి ఇటీవలే విజయ్ సేతుపతితో సినిమా సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలో టబు విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో టబు షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ తన అందాలతో మతిపోగొడుతోంది ఈ వయ్యారి భామ. తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.