
తెరపై కనిపించే ఎంతోమంది నటీమణులకు.. తెరవెనుక చాలానే రహస్యాలు దాగుంటాయి. చైల్డ్‌హుడ్ క్రష్, బాడీ షేమింగ్, లవ్ లైఫ్, ప్రెగ్నెన్సీ, అబార్షన్.. ఇలా చాలానే జరిగి ఉంటాయి. అలాంటి పలు సంచలన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది ఓ టాప్ హీరోయిన్. ‘సేక్రెడ్ గేమ్స్’.. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. ఆ సిరీస్‌లో నటించిన హీరోయిన్ కుబ్రా సేథ్.. తన వ్యక్తిగత జీవితంపై ఓ పుస్తకం రాసింది. ‘ఓపెన్ బుక్’ అనే పేరిట రిలీజ్ చేసిన ఈ పుస్తకంలో తన జీవితంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది ఈ నటి.
ఒకసారి తన స్నేహితుడితో కలిసి అండమాన్ ట్రిప్ వెళ్లినప్పుడు.. అతడితో వన్ నైట్ స్టాండ్ జరిగిందని.. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అయినట్టు తెలిసిందని కుబ్రా సేథ్ చెప్పింది. ఆ సమయంలో ఎవరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నా.. మానసికంగా చాలా కృంగిపోయానని నటి తెలిపింది. ‘నేను అబార్షన్ చేయించుకోకపోతే, ఆ బిడ్డకు జన్మనిచ్చి జీవితాంతం సింగిల్ మదర్‌గా జీవించే ధైర్యం నాకు ఉండేది కాదు. ఈ విషయం నా మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చివరికి, నేను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను” అని కుబ్రా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
అబార్షన్ జరిగిన ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత కూడా కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కొన్నా. ‘నేను ఒక ట్రావెల్ షో షూటింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభమైంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడప్పుడూ చాలా చిరాకుగా ఉండేది’ అని ఆమె పేర్కొంది. కాగా, కుబ్రా ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా వస్తోన్న ‘సన్ ఆఫ్ సర్దార్ -2’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
Lihat postingan ini di Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి