కెరటం మూవీతో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే తన నటన, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా తన సత్తా చాటింది.
వరసగా ఆఫర్స్ అందుకుంటూ.. కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, కాకి,మన్మథుడు 2 ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ చెక్కేసింది.
అక్కడ కూడా ఈ అందాల ముద్దుగుమ్మ తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఓ వైపు సినిమాలు, మరో వైపు బిజీనెస్లు చూసుకుంటూ, ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్‌తో నెట్టింట సందడి చేస్తుంటుంది. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన ఇన్ స్టాలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. అందులో ట్రెండీ డ్రెస్‌లో రకుల్ అదిరిపోయిందనే చెప్పాలి.
స్టైలిష్ లుక్‌లో ట్రెడీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను రకుల్ తన ఇన్ స్టాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోపై ఓ లుక్ వేయండి.