ఉప్పెన సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాలోనే తన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ అమ్మడు. బేబమ్మగా తెలుగు కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. ఎంట్రీ ఇవ్వడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. బంగార్రాజు, కస్టడీ, శ్యామ్ సింగ రాయ్, మనమే, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో బంగార్రాజు, ఉప్పెన సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలవగా మిగితా సినిమాలు మాత్రం అంత బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే చేసిన ప్రతి సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయాయి.
దీంతో ఈ అమ్మడుకు టాలీవుడ్లో ఆఫర్స్ రాకపోవడంతో తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్ పై కన్నేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అక్కడ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది కృతి. ఎప్పటికప్పుడు వరస ఫొటో షూట్స్ చేస్తూ.. తన అందంతో మతి పొగొడుతుంది.
తాజాగా ఈ బ్యూటీ, రెడ్ చీరలో అందంగా రెడీ అయ్యి పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత క్యూట్‌గా ఉంది.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో ఉల్లి పొరలాంటి చీరలో అందాలతో ఆగం చేయకు కృతి అని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం, రెడ్ చీరలో చాలా క్యూట్ గా ఉంన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.