ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ప్రముఖ కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనపై హీరో దర్శన్ అభిమానులు బూతులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర సందేశాలు పంపుతున్నారు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వీటిని బహిర్గతం చేసిన రమ్య దర్శన్ అభిమానులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి రమ్యకు మద్దతుగా నిలిచింది. అశ్లీల సందేశాలు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ‘మాజీ ఎంపీ, సినీ నటి రమ్యపై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు, సందేశాలు పోస్ట్ అవుతుండడం దారుణం. ఇది మహిళల స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కేసును నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయాలని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అవమానకరమైన సందేశాలను వెంటనే నిలిపివేయాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’ అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి లేఖలో పేర్కొన్నారు.

.

ఇవి కూడా చదవండి

వివాదం ఎలా మొదలైందంటే?

కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టులో దర్శన్ బెయిల్ విచారణ జరిగింది. దీనిపై రమ్య స్పందించింది. ‘భారతదేశంలోని సామాన్య ప్రజలకు సుప్రీంకోర్టు ఆశాకిరణం లాంటిది. రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది’ అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది రమ్య. అంతే దర్శన్ అభిమానులు రెచ్చిపోయారు. రమ్యకు గుంపగుత్తలా అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించారు. ఇక దర్శన్ అభిమానుల నుంచి వచ్చిన సందేశాలపై రమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దర్శన్ అభిమానుల తీరును ఖండించింది.

వివాదానికి కారణమైన రమ్య పోస్ట్ ఇదే..

ఈ విషయంలో పలువురు నటులు రమ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘నేను రమ్య మేడమ్ కోసం నిలబడతాను. ఆమె కోసం అందరం నిలబడదాం. ఇప్పటికీ రమ్య ఆత్మగౌరవం కోసం మనం నిలబడకపోతే, మనం కళాకారులుగా ఉన్నందుకు సిగ్గుపడాలి. కన్నడ చిత్ర పరిశ్రమను భయం నుంచి విముక్తి చేద్దాం’ అని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *