ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


సినిమా ఇండస్ట్రీలో ఒక్క మంచి హిట్‌తో ఫేమస్‌ అయి.. తర్వాత కనిపించకుండాపోయిన వాళ్లు కొందరున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ గాయత్రి జోషి ఒకరు. 2004లో వచ్చిన ‘స్వదేశ్‌’ సినిమాలో షారుక్ ఖాన్‌కు జోడీగా నటించింది. ఇదే ఆమె మొదటి సినిమా, ఇదే చివరిది కూడా. ఆ ఒక్క సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టిన గాయత్రి.. సినీ జీవితాన్ని వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.
ఒక్క హిట్ మూవీతో ఫేమ్.. ఆపై గుడ్‌బై!

‘స్వదేశ్’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడకపోయినా.. కథ, నటీనటుల పెర్ఫామెన్స్‌కు మంచి పేరు వచ్చింది. గాయత్రి జోషి తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయకుండా చిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పింది. అప్పట్లో మోడలింగ్ చేసి వచ్చిన గాయత్రి.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2005లో గాయత్రి.. ప్రముఖ బిల్డర్, ఒబెరాయ్‌ రియల్టీ CEO వికాస్‌ ఒబెరాయ్‌ను మ్యారేజ్ చేసుకుంది. పెళ్లైన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ పైనే పెట్టింది. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ముంబైలో విలాసవంతమైన ఇంట్లో జీవిస్తున్నారు.

వికాస్‌ ఒబెరాయ్‌ తండ్రి రణ్‌బీర్‌ ఒబెరాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అదే బిజినెస్‌ను కొనసాగిస్తూ.. వికాస్‌ వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ‘ఒబెరాయ్‌ రియల్టీ’ కంపెనీ ద్వారా ముంబైలో భారీ ప్రాజెక్ట్స్‌ నిర్మించాడు. వాటిలో ప్రముఖమైనది ‘360 వెస్ట్‌ ప్రాజెక్ట్‌’. ఈ ప్రాజెక్ట్‌లో అనేకమంది సెలబ్రిటీలు ఇళ్లను కొనుగోలు చేశారు. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లు ఆ లిస్టులో ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్‌లోని అపార్ట్‌మెంట్లు 4BHK, 5BHK విభాగాల్లో ఉన్నాయి. ఒక్క అపార్ట్‌మెంట్‌ ధర రూ. 45 కోట్లు నుంచి రూ. 57 కోట్ల వరకు ఉంటుంది. గాయత్రి–వికాస్ దంపతులు ఈ టవర్‌లోనే నివసిస్తున్నారు. ఇది రెసిడెన్షియల్ ఫ్లోర్స్‌తో పాటు Ritz–Carlton హోటల్‌తో కూడిన ప్రీమియం ప్రాజెక్ట్‌. భారీ ఫిట్నెస్ సెంటర్లు, జిమ్‌లు, పూల్స్, ప్లే గ్రౌండ్స్‌తో నిండి ఉంటుంది.

ఒక్క సినిమా చేసినా.. ఆమె ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సినిమాలకు దూరమైనా.. గాయత్రి ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ఇంట్లో, బిలియనీర్ భర్తతో లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్‌ దాదాపు రూ. 45,000 కోట్లు. గాయత్రి జీవితం చూసి పలువురు ‘ఫెయిరీ టేల్‌ లైఫ్‌’ అంటున్నారు!

Gayatri Joshi Full Pic



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *