విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యూట్యూబ్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిందీ మూవీ ట్రైలర్. అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో శ్రీలంకలో జరిగే స్టోరీతో కింగ్ డమ్ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా కనిపించారు. ట్రైలర్ లో కూడా వీరిద్దరే బాగా హైలెట్ అయ్యారు. అయితే అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా బాగా హైలైట్ అయ్యాడు. అతను ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. కింగ్ డమ్ ట్రైలర్లో రెండు మూడు క్లోజప్ షాట్స్‌లో కనిపించిన ఈ నటుడు మలయాళంలో కొన్ని సినిమాలు, టీవీ షోస్ చేశాడు. ఇప్పుడు విజయ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కింగ్ డమ్ ట్రైలర్ రిలీజయ్యాక ఈ నటుడి పేరు నెట్టింట మార్మోగిపోయింది. ఎవరీ నటుడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని సినీ ప్రియులు, నెటిజన్లు తెగ సర్చ్ చేశారు. ప్రముఖ డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వెంకటేశ్ ఫోటోను షేర్ చేసి, ఎవరు ఈ నటుడు? అదరగొట్టేశాడంటూ ట్వీట్ చేశాడు.
కింగ్ డమ్ ట్రైలర్ లో కనిపించిన ఈ నటుడి పేరు వెంకటేశ్ వీపీ. 2014 నుంచి మలయాళ టీవీ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇక 2018లో ‘ఓడియన్’, ‘వెలిపాడింటే పుస్తకం’, ‘తట్టుంపురత్ అచ్యుతన్’ వంటి సినిమాల్లోనూ నటించాడు. తమిళ్లో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వచ్చిన రెబల్ మూవీలో విలన్‌గా నటించాడు వెంకటేశ్ వీపీ. ఈ సినిమాను చూసే అతనిని కింగ్డమ్ మూవీకి సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కింగ్ డమ్ సినిమాలో వెంకటేష్..
G.O.W.T.A.M T.I.N.N.A.N.U.R.I 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Holy smoking blazes! What sambhavam have you cooked man?! Excited maxxx!
Vijay D is clearly going to be unleashed! And who is this? Gonna watch out for him! #Kingdom pic.twitter.com/bDnEgIbyBO— Rahul Ravindran (@23_rahulr) July 26, 2025
కాగా కింగ్డమ్ సినిమా ట్రైలర్ రిలీజ్‌కి ముందు వెంకటేశ్ వీపీకి సోషల్ మీడియాలో 1 లక్ష ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే విజయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అతని ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. కింగ్ డమ్ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పరిచయం చేసిన వారందరూ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉంటున్నారు. మరి కింగ్ డమ్ సినిమా రిలీజ్ తర్వాత వెంకటేశ్ వీపీ కూడా తెలుగులో బిజీ నటుడిగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి.
వెంకటేష్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి