టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల హవా కనిపిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కుర్ర హీరోలు. కొత్త కొత్త కథలు, కొత్త కొత్త దర్శకులతో చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎప్పటిలానే బడా డైరెక్టర్స్ తో సినిమాలు చేసి పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్యలో ఉన్న టైర్ 2 హీరోలు మాత్రం హిట్స్ లేక సతమతం అవుతున్నారు. టైర్ 2 హీరోల లిస్ట్ లో నితిన్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, శర్వానంద్ ఇలా మరికొంతమంది హీరోలు ఉన్నారు. ఈ హీరోలు హిట్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో ఒకరు.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిన హీరో అతను. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసి ప్రేక్షకులను కట్టుకున్నాడు. ఆయన సినిమా వస్తుంటే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడతారు.. కానీ ఒకానొక స్టేజ్ లో ఆయన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఏడేళ్ల పాటు సరైన హిట్ లేక అల్లాడిపోయాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో మరెవరో కాదు. తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన నరేశ్.. ఆతర్వాత వరుస పరాజయాలను చూశాడు. 2012వరకు నరేష్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. వరుస సినిమాలు.. ఏడాది 5 సినిమాలు చేసి మెప్పించాడు. అలాగే వారు విజయాలను అందుకున్నాడు. సుడిగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆతర్వాత 2012 నుంచి 2019వరకు వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు నరేష్. ఏడేళ్లు హిట్స్ లేక సతమతం అయ్యాడు ఈ యంగ్ హీరో.. ఇక నాంది సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కామెడీ క్యారెక్టర్స్ మాత్రమే కాదు సీరియస్ రోల్స్ లోనూ నటించి అదరగొట్టాడు నరేష్.. ఇక ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. చివరిగా బచ్చల మల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్.. ఇప్పుడు ఆల్కహాల్ అనే సినిమాతో రానున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి