
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగాతనకు అవకాశమిచ్చిన డైరెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిందీ అందాల తార. అలాగే కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ హార్ట్ బీట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపించింది. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ ఫెర్ఫామెన్స్ ఉంటుందని పేర్కొంది.