ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీస్‌లో రంభ ఒకరు. ఈ అమ్మడి అందానికి అప్పట్లో కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ.. తోలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులు దోచేసింది. తన గ్లామర్ తో యూత్ ను ఊపేసింది. ఈ చిన్న దానికోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారట అర్ధం చేసుకోవచ్చు ఆమె ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోలతో జతకట్టి అలరించింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి బాషల్లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో చేసింది ఈ అమ్మడు. అయితే ఒకసారి రంభ చేసిన పనికి సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారట.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

రంభ ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్ గా గడిపింది. ఒక సమయంలో రెండు, మూడు సినిమా షూటింగ్స్ చేసింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో అరుణాచలం అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో ఓ సినిమా కూడా చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బంధన్ అనే సినిమాలో కూడా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ కు ఒకే సారి జరిగేవట.. అరుణాచలం సినిమా ఉదయం షూట్ చేస్తే.. బంధన్ సినిమా సాయంత్రం షూట్ చేసిందట రంభ. పైగా ఈ రెండు షూటింగ్స్ పక్కపక్కనే జరిగేవట. ఒకసారి సల్మాన్ ఖాన్ అరుణాచలం సినిమా షూటింగ్ కు వచ్చారట. దాంతో రంభ సల్మాన్ ను చూసి వెంటనే వెళ్లి అతనికి హగ్ ఇచ్చి పలకరించిందట. అది చూసిన రజినీకాంత్ దర్శకుడితో ఎదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఆతర్వాత రజినీ కాంత్ వచ్చి టవల్ విసిరికొట్టి తనతో కోపంగా మాట్లాడాడట.. దర్శకుడు కూడా ఆమె వైపు కంగారుగా చూశారట. ఆ తర్వాత దర్శకుడు వచ్చి మీరు అలా చేయకుండా ఉండాల్సింది.. ఆయన మీతో సినిమాలు చేయను అంటున్నారు అని చెప్పాడట. దాంతో రంభకు ఏమి అర్ధం కాలేదట. ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టిందట. ఆతర్వాత రజినీకాంత్ వచ్చి ఇదంతా నిన్ను ఆటపట్టించడానికే.. బాలీవుడ్ హీరోలు వస్తే హగ్ ఇస్తారు.. అదే మేము పలకరిస్తే షేక్ హ్యాండ్ ఇస్తారు అని ఆటపట్టించారట. ఇదంతా సెట్ లో అందరికి ముందే తెలుసు అని తెలిపింది రంభ.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *