తాజా వార్తలు

తాజా వార్తలు


రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ రిలీజ్ కు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కాగా కింగ్ డమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా మారారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సినిమాపై సందీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు.

‘నేను కింగ్ డమ్ సినిమాను సుమారు 45 నిమిషాల పాటు చూశాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేద‌నే విషయం కూడా మర్చిపోయాను. అంతగా మూవీలో లీనమయ్యాను. విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గౌతమ్ సూపర్ హిట్ కొట్టాడు. సినిమా మాడ్‌గా ఉంది. వేరే లెవల్ అనిపించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అతని లుక్స్ కూడా అదిరిపోయాయి. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నేను విజయ్‌కు ఫోన్ చేసి లుక్ అదిరిపోయిందన్నాను. ఇప్పుడు మూవీ చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. అనిరుధ్‌ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆర్‌ఆర్ అద్భుతంగా ఉండబోతుంది’ అని చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ..

సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే ఈ స్టార్ డైరెక్టర్ ఇంతలా చెప్పాడంటే కింగ్ డమ్ మూవీలో ఏదో స్పెషల్ ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *