
జీడిపప్పు ఇది రుచికరంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే మన తినే చాలా ఆహారాల్లో దీన్ని తీసుకుంటూ ఉంటాం. కానీ వీటిని ఎలా తినాలి, ఇవి ఎక్కువగా తినడం వల్ల ఏవైనా సమస్యలు వాస్తాయా అనేది మాత్రం ఎవరం ఆలోచించం. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని సరైన మొతాదులో తీసుకోకపోతే( ఎక్కవగా తీసుకుంటే).. ఒత్తిడి , బరువు పెరగడం వంటి సమస్యలను మనం ఎదుర్కోవలపి ఉంటుందని చెబుతున్నారు. మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే రోజుకు 5 నుండి 10 జీడిపప్పులు మాత్రమే తీసుకోవాలని నిపుణలు చెబుతున్నారు.
జీడిపప్పు యొక్క ప్రయోజనాలు
ఇతర రకాల పప్పులతో పోలిస్తే జీడిపప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ఎక్కువగా హల్వా, పాయసం, స్వీట్లు, బిర్యానీ, పులావ్ వంటి వంటలలో ఉపయోగిస్తాం. కానీ దీన్ని ఎక్కువగా తినడం మంచిదా? మీరు ఎంత తినాలి? చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయి. నిజం చెప్పాలంటే, జీడిపప్పులో మంచి కొవ్వుల పదార్థాలు ఉంటాయి. అంతే కాదు, అవి శరీరానికి ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి2, జింక్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ పోషకాలన్ని మనం ఆరోగ్యంగా ఉండేందుకు తోల్పడతాయి
రోజుకు ఎంత జీడిపప్పు తినాలి?
అయితే, జీడిపప్పును అధికంగా తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకోసం రోజుకు 5 నుండి 10 జీడిపప్పులు తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు బరువు పెరగాలి, మీకు ఎక్కువ కొవ్వు, ప్రోటీన్ అవసరం అనుకుంటే రోజుకు 15 నుండి 30 తీసుకోవచ్చు. కానీ మీరు బరువు పెరుగుటంలో ఆందోళన చెందుతుంటే, డైటీషియన్‌ను సంప్రదించిన తర్వాత వీటిని తీసుకోవడం మంచిది. అయితే కొంతమంది రోజుకు 30 కంటే ఎక్కువ జీడిపప్పులు కూడా తింటుంటారు. కానీ అంత ఎక్కువగా తినడం అందరికీ మంచిది కాదు. మీరు అథ్లెట్ అయినా లేదా ఫిట్నెస్ వర్కౌట్స్ చేసేవారు, జీడిపప్పు ఎక్కువగా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే అథ్లెట్, ఫిట్‌నెట్ వర్కౌట్స్ చేసే వారి జీర్ణప్రక్రియ వేగంగా పనిచేస్తుంది. దీంతో తిన్న ఆహారాన్ని మన శరీరం వెంటనే శక్తగా మారుస్తుంది. దీంతో వారు తక్కువ టైంలోనే ఎక్కవ శక్తని వినియోగించగలుగుతారు. కానీ సాధారణ జీవనశైలి ఉన్నవారు అంత శక్తిని ఖర్చు చేయలేరు, కాబట్టి వారు ఎక్కువ జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇందులో ముఖ్యంగా బరువు పెరగడం, ఒత్తిడి, అలెర్జీలు, కడుపు నొప్పి, వాంతులు, అలసట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే జీడిపప్పు తినేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తగిన పరిమితుల్లో తినడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.