
సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు ఆమ్మాయిలపైనే అఘాయిత్యాలకు పాల్పడే ఈ మానవమృగాలు ఇప్పుడు అబ్బాలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ తమ కామకోరికలను తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఓ స్కూల్ 14 ఏళ్ల బాలుడిపై ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న సాయంత్రం సమయంలో తమకు ఒక పీసీఆర్ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి సెంట్రల్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నట్టు తెలిపాడు. అక్కడ స్థానికంగా ఉన్న ఒక స్కూల్ వాష్‌రూమ్‌లో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు అతను సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, అప్పటికే అక్కడికి వచ్చిన బాధిత బాలుడి తల్లిదండ్రులు బాబును తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత బాధితుడికి కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించడంతో లైంగిక వేధింపులు జరిగినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో రోజురోజుకు మైనర్లపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. లైంగిక ఆరోపణల కారణంగా రోజుకు సుమారుగా ఐదుగురు వ్యక్తులు అరెస్టు అవుతున్నారు. అంతే కాకుండా రోజుకు నాలుగు పోక్సో కేసుల వరకు నమోదు అవుతన్నాయి. ఈ గణాంకాలు పిల్లలపై జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.