
ఇటీవలి కాలంలో దేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది తక్కువ ధరలకు ఖరీదైన సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్లు అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుగోలు చేసే ముందు, ఇవి దొంగిలించబడిన ఫోన్లా.? కాదా..? అని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు.
సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్డ్ ఫోన్లు కొంటే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదని అంటున్నారు. కానీ కొన్ని కంపెనీలు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరలకు విక్రయిస్తాయి. వాటికి ఎటువంటి ప్రామాణికత ఉండదు. తక్కువ రేట్ ఉండడంతో చాలా మంది వాటిని కొనుగోలు చేస్తారు. వాటిని కొనుగోలు చేసే ముందు చెక్ చేయడం ముఖ్యం. దీనికి సంబంధించి ప్రజలు ఈజీగా చెక్ చేసుకునేలా ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఫోన్ ను చెక్ చేసుకోవచ్చు.
ఎలా చెక్ చేయాలి..?
ముందు మీరు ఆ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్ తెలుసుకోవాలి. మీరు కొనుగోలు చేస్తున్న ఫోన్లో బాక్స్ లేకపోతే.. *#06# అని టైప్ చేసి ఐఎమ్ఈఐ నంబర్ తెలుసుకోవచ్చు. ఐఎమ్ఈఐ నంబర్ తెలిసిన తర్వాత మెసేజెస్ యాప్‌కి వెళ్లాలి. KYM అని టైప్ చేసి 15-అంకెల ఐఎమ్ఈఐ నంబర్‌ను ఎంటర్ చేసి 14422కి పంపాలి.
బ్లాక్‌లిస్ట్ అని వస్తే..
ఈ మెసేజ్ సెండ్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం నుండి డీటెయిల్స్ వస్తాయి. అది ఫోన్ దొంగిలించబడిందా లేదా సమాచారం వస్తుంది. రిప్లై బ్లాక్‌లిస్ట్ అని వస్తే.. ఆ ఫోన్ దొంగిలించబడిందని, దాన్ని ఐఎమ్ఈఐ నంబర్ బ్లాక్‌లిస్ట్ చేశారని అర్థం. అలా వస్తే ఆ ఫోన్‌ను కొనుగోలు చేయకపోవడమే బెటర్. మీరు చోరీ చేసిన ఫోన్ కొంటే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వస్తది. కాబట్టి చెక్ చేశాకే కొనుక్కోండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..