సాధారణంగా మనలో చాలా మంది కొన్ని అవసరాల మేరకు ప్రభుత్వ అధికారుల నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, పెంపుడు జంతువులకు కూడా ఇలాంటి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండటం మీరెప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? ఏంటి షాక్ అవుతున్నారా..? బీహార్‌లోని అలాంటిదే షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై 24న బీహార్‌లో ఒక కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేయబడింది. ఈ విచిత్ర సంఘటనతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పాట్నా డిఎం ఈ విషయాన్ని గుర్తించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ కుక్క హౌసింగ్ సర్టిఫికెట్‌కు సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సర్టిఫికెట్లో ఒక కుక్క ఫోటో కూడా ఉంది.
పాట్నా జిల్లాలోని మసౌర్హి జోన్ ఆఫీస్ RTPS పోర్టల్ నుంచి జారీ అయిన కుక్క నివాస ధృవీకరణ పత్రం మొత్తం పరిపాలనా వ్యవస్థను విమర్శల పాలు చేసింది. ఈ సర్టిఫికెట్లో కుక్కపేరు డాగ్‌బాబు అని స్పష్టంగా ఉంది. తండ్రి పేరు కుట్ట బాబు, తల్లి పేరు కుటియా దేవిగా ఉన్నాయి. మొహల్లా కౌలిచక్, వార్డ్ నంబర్ 15, నగర్ పరిషత్ మసౌర్హిగా అడ్రెస్ ఉండగా, సర్టిఫికెట్ నంబర్ BRCCO/2025/15933581. దీనిపై మసౌర్హి జోన్ ఆఫీస్ రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ డిజిటల్ సంతకం కూడా ఆ కుక్క రెసిడెన్స్ సర్టిఫికెట్లో ఉంది. దాని బట్టి ఇది ఎలాంటి ఫేక్ కాదు. అధికారులు ధ్రువీకరించి జారీ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారటంతో సంబంధింత అధికారులు రంగంలోకి దిగారు.
ఇవి కూడా చదవండి
मसौढ़ी अंचल में ‘डॉग बाबू’ के नाम से निवास प्रमाण पत्र निर्गत करने का मामला प्रकाश में आया है। मामला संज्ञान में आते ही उक्त निवास प्रमाण पत्र रद्द कर दिया गया है।
साथ ही आवेदक, कंप्यूटर ऑपरेटर एवं प्रमाण पत्र निर्गत करने वाले पदाधिकारी के विरुद्ध स्थानीय थाना में प्राथमिकी… pic.twitter.com/POxB4nXFch
— District Administration Patna (@dm_patna) July 28, 2025
బాధ్యులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. సబ్-డివిజనల్ ఆఫీసర్ మసౌర్హిని 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కోరారు. దీనితో పాటు, దోషులుగా ఉన్న సిబ్బంది, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ట్వీట్ చేయడం ద్వారా మొత్తం విషయంలో చర్య తీసుకోవాలని ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..