తాజా వార్తలు

తాజా వార్తలు


మధుమేహం.. దీనిన డయాబెటిస్‌, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా నేడు పిల్లల నుంచి పెద్దల దాకా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదని నిపుణులు పదే పదే చెబుతుంటారు. అయితే, మధుమేహంతో మందులు తింటున్నవారు మఖానా తినొచ్చా..? తింటే శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మఖానా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహానికి మంచివిగా పరిగణించబడతాయి. మఖానాలో యాంటీ డయాబెటిక్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ, తగ్గుతూ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో మఖానాను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి లైట్ స్నాక్‌గా కూడా మఖానాను తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, వీటిని నూనెలో వేయించకుండా పొడి వేపడం మంచిది. ఉప్పు లేకుండా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. అలాగే, రోజుకు కొద్దిగా మాత్రమే తినాలని చెబుతున్నారు. డాక్టర్ సలహాతో మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద మఖానా మధుమేహులకు సరైన ఆహారంగా చెప్పొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *