తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో చోటుచేసుకుంది ఈ సంఘటన. సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సత్య శంకర్ అనే విద్యార్థి.. అదే కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. కానీ, బొమ్మూరుకు చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నానంటూ రావటంతో.. ఈ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సత్య శంకర్ కళాశాల బస్సులో రాజమండ్రి నుంచి సూరంపాలెం వెళుతుండగా, దారి కాచిన బొమ్మూరు విద్యార్థి.. మరో ఇద్దరు యువకులతో కలిసిన కాలేజీ బస్సును ఆపాడు. బస్సులో ఎక్కి..కత్తితో సత్య శంకర్‌ను పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ సత్య శంకర్‌ను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. ఆధార్ లేకున్నా తత్కాల్ టికెట్లు
రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే
వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం
అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్
నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం