తాజా వార్తలు

తాజా వార్తలు


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న తండ్రీకూతుళ్లను ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రి స్పాట్‌లో చనిపోగా.. కూతురు మాత్రం ట్యాంకర్‌ టైర్‌ కిందపడి నలిగి పోయింది. తీవ్రగాయాలైన యువతి తనను కాపాడాలని స్థానికులను వేడుకుంది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. స్థానికులు కాపాడే లోపే ఆమె విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టిండమే కాకుండా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్‌లో నివాసం ఉంటున్న మచ్చేందర్ అనే వ్యక్తి తన కూమార్తెను కాలేజీ బస్సు ఎక్కించేందుకు స్కూటీపై తీసుకెళ్తున్నాడు. షాద్ నగర్ చౌరస్తా వద్దకు రాగానే అటుగా వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ తండ్రీకూతుళ్లు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి మచ్చేందర్ స్పాట్‌లోనే చనిపోయాడు. కుమార్తె మాత్రం ట్యాంకర్‌ టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న యువతి తనను కాపాడాలని స్థానికులను వేడుకుంది. తనను కాపాడాలంటూ యువతి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అంతటి పరిస్థితుల్లో కూడా యువతి తన ఫోన్‌ను పక్కనే ఉన్న వారికి ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని కోరింది.

ఇలా సదురు వ్యక్తి యువతి ఫోన్‌ తీసుకోగానే ఆమె ఫోన్‌కు తన స్నేహితురాలి నుంచి ఒక కాల్‌ వచ్చింది. ఆ కాల్‌ లిఫ్ట్‌ చేసిన వ్యక్తి ప్రమాదం గురించి ఆమె తెలియజేసి బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ వెంటనే అంబులెన్స్‌ ఫోన్‌ చేశాడు. కానీ తీవ్ర రక్తశ్రాసం కావడంతో అంబులెన్స్‌ వచ్చేలోపే యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *