తాజా వార్తలు

తాజా వార్తలు


India vs Pakistan: క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్) 2025 ఆసియా కప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరగనుంది. మొత్తం 8 దేశాలు పాల్గొనే ఈ టీ20 ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లు ఎప్పుడు, ఎవరితో ఆడతాయో తెలుసుకుందాం..

యూఏఈలో ఆసియా కప్: ఆతిథ్యం భారత్‌దే..!

ఆసియా కప్ 2025కు అధికారికంగా భారత్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ, భారత, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన యూఏఈకి తరలించారు. దుబాయ్, అబుధాబి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు ఆడనున్నారు.

భారత జట్టు మ్యాచ్‌ల వివరాలు (గ్రూప్ స్టేజ్):

మోహ్సిన్ నఖ్వీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, భారత జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్‌ జట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్

భారత్-పాకిస్థాన్‌ల మధ్య హైవోల్టేజ్ పోరు..!

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 22న మళ్లీ ఒకసారి తలపడే అవకాశం ఉంది. అంతేకాకుండా, రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే, ఆసియా కప్ చరిత్రలో మరో ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్థాన్ ఫైనల్‌ను చూడవచ్చు.

టోర్నమెంట్ ఫార్మాట్, ఇతర వివరాలు:

తేదీలు: సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28, 2025

వేదిక: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) – దుబాయ్, అబుధాబి

ఫార్మాట్: టీ20

పాల్గొనే దేశాలు: భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ, హాంకాంగ్, ఒమన్.

ఫైనల్ మ్యాచ్: సెప్టెంబర్ 28

ఆసియా కప్ 2025 టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరగనున్నందున, జట్లకు ఇది మంచి సన్నాహక టోర్నమెంట్‌గా ఉపయోగపడనుంది. ఈసారి ఆసియా కప్ ఉత్కంఠభరితంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ తెలిపారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *