మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం…! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం…! డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న అధికారులు… లేటెస్ట్గా రేవ్ పార్టీని భగ్నం చేయడంతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. యస్.. హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్ చేశారు. మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందినవారుగా గుర్తించారు.
గంజాయితో పాటు డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ నిర్వహించింది అశోక్నాయుడుగా గుర్తించారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, OG kush, LSD బోల్ట్, చరాస్ స్వాధీనం చేసుకున్నారు.
నిందుతులు వాడుతున్న హై ఎండ్ కార్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్ డ్రగ్స్ ను పెడ్లేర్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో శ్రీనివాస్ చౌదరి, అఖిల్ పారి పోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్లోని SV నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో భగ్నం చేశారు.