తెలంగాణ

తెలంగాణ


ఆటలాడితే, ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్‌గా షటిల్‌ ఆడుతున్నా.. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్‌, మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నాగోల్‌లో ఈ జరగరాని ఘోరం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఎలక్ట్రానిక్‌ కార్‌ షోరూమ్‌లో రాకేష్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి రోజూ షటిల్‌ ఆడే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం, హైదరాబాదులోని నాగోల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడుతుండగా, గుండె పోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలాడు..

ఏం జరిగిందో తెలియక తోటి స్నేహితులు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి లేపే ప్రయత్నం చేశారు.. అప్పటికే.. అతను స్పృహ కోల్పోయాడు.. వెంటనే.. హుటాహుటిన స్నేహితులు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

వీడియో చూడండి..

చనిపోయిన రాకేష్‌- తల్లాడ మండల మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు.. చేతికి వచ్చిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

ప్రస్తుత కాలంలో రోజు రోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువత లో గుండెపోటు మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది..పైకి ఆరోగ్యంగా కనిపిస్తూ తిరుగుతూ ఉన్న వారు కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందుతుందటంతో పలు కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *