తెలంగాణ

తెలంగాణ


ఇంట్లో శునకాన్ని పెంచుకోవడం మీకు ఇష్టమా.. ఖరీదైన విదేశీ బ్రీడ్‌ను కొనే స్థోమత లేదా..అయితే మీలాంటి వారి కోసమే ‘తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ ఉంది. దీని నిర్వాహకులు కుక్కలను దత్తత ఇస్తున్నారు. ఈ సంస్థను విజయలక్ష్మి అనే మహిళ స్థాపించారు. 50 మంది వాలంటీర్లు ఈ తెలంగాణ పెట్ అడాప్షన్‌లో పని చేస్తున్నారు. ఈ సంస్థలో నమోదైన వాలంటీర్లు తీసుకువచ్చే కుక్కలను మాత్రమే ఇక్కడ దత్తత ఇస్తారు. ఇతరులు రెస్క్యూ చేసిన వాటిని పరీక్షలు చేసి తీసుకుంటారు. వాటిని కొన్నిరోజుల పాటు సంరక్షిస్తారు. ఆ తర్వాత కుక్కలు కావాలని ఎవరైనా వస్తే వారికి వీటిని దత్తత ఇస్తారు.

అయితే ప్రతి ఆదివారం హైదరాబాద్ నగరంలోని నేరెడ్ మెట్‌లో ఈ దత్తత కార్యక్రమం నిర్వహిస్తారు. దత్తత తీసుకునే వారికి వాటిని చూసుకునే స్థోమత ఉందా లేదా అని కూడా చూస్తారు. ఇందుకు స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు. దత్తత తీసుకునే వ్యక్తికి ఆయన కుటుంబానికి కౌన్సెలింగ్ ఇస్తారు. అద్దె ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకుంటారు. ప్రతి వారం సుమారు 30 నుండి 40 కుక్కలు దత్తత ఇస్తున్నారు. ఈ క్యాంపు ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. దత్తత తీసుకునే వ్యక్తి, చిరునామా గుర్తింపు కార్డు తదితర పత్రాలు సేకరిస్తారు. అన్నీ అయ్యాక వ్యాక్సినేషన్ పూర్తయిన కుక్కలను అందిస్తారు.

అంతేకాకుండా ప్రతి నెలా వాటి బాగోగుల గురించి కూడా తెలుసుకుంటారు. ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. వాక్సినేషన్ సమయాన్ని ముందుగానే గుర్తుచేస్తారు. ఇలా రెండు సంవత్సరాల వరకు చేస్తారు. ఈ స్వచ్చంద సంస్థ ప్రారంభించిన వాటినుండి దాదాపు 6 వేల కుక్కలను దత్తత ఇచ్చినట్లు నిర్వాహకులు అంటున్నారు. ఇలా విధుల్లో తిరిగే కుక్కలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న తెలంగాణ పెట్ అడాప్షన్ నిర్వాహకులను అక్కడికి వచ్చే సందర్శకులు అభినందిస్తున్నారు.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *