తెలంగాణ

తెలంగాణ


హైదరాబాద్‌, జులై 28: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 4 రోజుల ముందు అంటే జులై 31వ తేదీన అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తారు.

పరీక్ష రోజున విద్యార్థులను 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్‌ సెంటర్లలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పీజీ రాయనున్నారు. తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా మొత్తం 10 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్షల అనంతరం సెప్టెంబర్‌ 3 నాటికి ఫలితాలను విడుదల చేయనున్నట్లు మెడికల్‌ బోర్డు తెలిపింది. వాస్తవానికి జూన్‌ 15న రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్‌బీఈఎంఎస్‌ ఆగస్టు 3కు పరీక్షను వాయిదా వేసింది. గతేడాది దేశంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 25,791 సీట్లను కేటాయించారు.

నీట్‌ పీజీ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *