వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బాంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందంది.
అలాగే ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు..ఈరోజు,రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశముంది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. హైదరాబాద్‌లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.
Today’s FORECAST ⚠️🌧️
GUSTY WINDS UPTO 40-45Kmph are expected in entire Telangana
MODERATE RAINS ahead in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Kamareddy, Sircilla, Jagitial, Mancherial, Peddapalli, Vikarabad, Sangareddy, Rangareddy
LIGHT RAINS/PASSING SHORT RAINS in rest…
— Telangana Weatherman (@balaji25_t) July 26, 2025
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం చాలా చోట్ల పడుతుంది. అయితే.. ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడొచ్చు. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విజయవాడలో వరదలు వస్తున్నాయన్న వదంతులను నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..