తెలంగాణలో పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 44లక్షల మంది పెన్షన్లను అందుకుంటున్నారు. అయితే చాలా మంది పింఛన్ తీసుకునే సమయంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫింగర్ ప్రింట్స్ రాక చాలా మంది వృద్ధులు పెన్షన్స్ తీసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని పలుచోట్ల అవకతవకలు చోటుచేసుకున్న ఘటనలు లేకపోలేదు. ఈ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. చాలా మంది వృద్ధుల వేళ్ల రేఖలు పోవడం వల్ల ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా రావడం లేదు. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనుంది.
తొలి దశలో 23లక్షల మందికి..
తొలిదశలో పోస్టాఫిసుల్లో పెన్షన్లు తీసుకునే 23లక్షల మందికి దీన్ని అమలు చేయనున్నారు. బ్యాంకుల్లో పెన్షన్లు తీసుకుంటున్న 21 లక్షల మంది మాత్రమే పాత విధానంలోనే పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్‌ను తెచ్చింది. పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లకు దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లను అందించనుంది.
ప్రాసెస్ ఇలా ఉంటుంది..
పోస్టాఫీస్‌లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్లిన వారి ఫొటో తీసి.. ఆధార్‌తో చెక్ చేసి.. యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత వారికి పెన్షన్ అందించారు. ఎవరికైన ఫొటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తారు. ఫొటో, బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శుల ఫింగర్ ప్రింట్‌తో డబ్బులు అందజేస్తారు.
మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..