సొంత ఇల్లు కలిగి ఉండాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రస్తుత కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ.. ఎప్పటికైనా మంచి ఇళ్లు కొనాలని, కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేవారు ఎక్కువగా హోమ్ లోన్ తీసుకొని ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుకుంటూ ఉంటారు. అయితే మరి యువ జంటలు జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మంచిదా? లేక ఇద్దరూ పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిదా అనే విషయంపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. జాయింట్ హోమ్ లోన్, పర్సనల్ లోన్ రెండూ చాలా భిన్నమైనవి. కొన్ని సార్లు తమకు సెట్‌కాని లోన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల నష్టపోతారు. వడ్డీ రూపంలో ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.
ఆర్థిక నిపుణుల ప్రకారం దంపతులిద్దరూ పర్సనల్ లోన్ తీసుకోవడం కంటే.. జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడమే ఉత్తమం అని అంటున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరించాడు..
తక్కువ వడ్డీ
జాయింట్ హోమ్ లోన్‌కు సాధారణంగా పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. భారతదేశంలో నేడు గృహ రుణ రేట్లు సంవత్సరానికి 8–9 శాతంగా ఉన్నాయి. అయితే వ్యక్తిగత రుణాలు 16 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
జాయింట్ హోమ్ లోన్‌తో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే తిరిగి చెల్లించే కాలం. గృహ రుణాలు 20–30 సంవత్సరాల వరకు ఉంటాయి, ఇది నెలవారీ EMIని సరసమైనదిగా ఉంచుతుంది. వ్యక్తిగత రుణాలు సాధారణంగా 1–5 సంవత్సరాలలోపు చెల్లించాల్సి ఉంటుంది, దీని వలన నెలవారీ వాయిదాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
డబుల్ టాక్స్ సేవింగ్స్
ఉమ్మడి గృహ రుణాలు మరో పెద్ద ప్రయోజం ఏంటంటే.. పన్ను ప్రయోజనాలు. భాగస్వాములిద్దరూ సెక్షన్ 80C కింద అసలు చెల్లింపుపై ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24(b) కింద వడ్డీపై ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం అందమైన పొదుపును జోడించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి